నిండు జీవితానికి రెండు చుక్కలు

by Jakkula.Mamatha |

చిన్నారుల ఆరోగ్య రక్షణకు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారి కీర్తన, మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు
X

దిశ, చొప్పదండి: చిన్నారుల ఆరోగ్య రక్షణకు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారి కీర్తన, మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రయాణికుల కోసం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. కమిషనర్ నాగరాజుతో కలిసి వైద్యాధికారి కీర్తన చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ 0-5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలని అప్పుడే పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సీ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story