- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నచ్చకపోతే ఫాలో అవడం మానేయండి కానీ విమర్శించే హక్కు మీకు లేదు.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ
నా కుమార్తె పెళ్లి జరిగి కనీసం 48 గంటలు కూడా కాలేదు. ఒక తల్లిగా ఆ సంతోషాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. కానీ నన్ను విమర్శించే హక్కు మాత్రం మీకు లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ నటి, ఒకప్పటి హీరోయిన్, రాయకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తన వ్యక్తిగత విషయాలతో ఫ్యామిలీని ఎవరు ఏమన్నా తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా, తన పెద్ద కుమార్తె అవంతిక వివాహ వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, ఈ ట్రోల్స్‌పై ఖుష్బూ మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు గట్టిగా బుద్ధి చెప్పారు.ఇటీవల గోవా వేదికగా ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్‌ల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, త్రిష, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి వారు హాజరై సందడి చేశారు.అయితే, ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్.. మెగాస్టార్ చిరంజీవిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కొద్ది గంటలకే ఊహించని విధంగా గుండెపోటుతో మరణించారు.
ఈ విషాదం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద సమయంలోనే ఖుష్బూ తన కుమార్తె పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. అంత పెద్ద నటుడు మరణిస్తే, ఇలాంటి సమయంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేయడం అవసరమా అంటూ దారుణంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై ఖుష్బూ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "కేవలం నన్ను విమర్శించడానికే నన్ను ఫాలో అవుతున్నారా? నా కుమార్తె పెళ్లి జరిగి కనీసం 48 గంటలు కూడా కాలేదు. ఒక తల్లిగా ఆ సంతోషాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. కానీ నన్ను విమర్శించే హక్కు మాత్రం మీకు లేదు. మరణించిన భాగ్యరాజ్ భార్య పూర్ణిమతో నాకున్న సాన్నిహిత్యం, అనుబంధం గురించి ఇతరుల కంటే నాకే బాగా తెలుసు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి. నా పద్ధతి నచ్చకపోతే నన్ను ఫాలో అవ్వడం మానేయండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






