ప్రతి రూపాయికీ లెక్క తేలాలి: అయోధ్య విరాళాల అక్రమాలపై పినరయి విజయన్ సంచలన డిమాండ్

by Gantepaka Srikanth |

అయోధ్య రామాలయం నిర్మాణానికి సంబంధించి భక్తుల నుంచి సేకరించిన విరాళాలలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయనే నివేదికలపై కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి రూపాయికీ లెక్క తేలాలి: అయోధ్య విరాళాల అక్రమాలపై పినరయి విజయన్ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామాలయం నిర్మాణానికి సంబంధించి భక్తుల నుంచి సేకరించిన విరాళాలలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయనే నివేదికలపై కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతమైన స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పలు ప్రశ్నలు సంధించారు.

విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలు!

ప్రజల భక్తిని, వైకారికతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న శక్తులు.. ఇప్పుడు దాని వెనుక వ్యవస్థీకృత ఆర్థిక మోసాలకు (Organised Financial Fraud) పాల్పడ్డాయనే ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన విషయమని పినరయి విజయన్ పేర్కొన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా సమర్పించిన కానుకలు, సొమ్ము ఎటు మళ్లాయో తేలాల్సిన అవసరం ఉందన్నారు. "రామాలయ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి స్వయంగా అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేసిన ట్రస్టే ఇప్పుడు సంబాణంంలో పడింది." అని విజయన్ స్పష్టం చేశారు.

ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలి..

భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన వారిని వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించి, భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయికి పూర్తి జవాబుదారీతనాన్ని (Accountability) నిరూపించాలని పినరయి విజయన్ గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విరాళాల వెల్లువలో జరిగిన అక్రమాల నివేదికలు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

Next Story