- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగోలీగూడెంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..!
జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున చిన్నగూడూరు మండలం మంగోలీగూడెం గ్రామంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మరిపెడ సర్కిల్ పోలీసులు, క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్) బలగాలతో కలిసి గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టి సుమారు 250 ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గుడుంబా తయారీకి వినియోగిస్తున్న నల్లబెల్లం, గుడుంబా, పటిక, నల్లబెల్లం ఊట (వాష్)ను భారీగా స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ అనంతరం గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొంటూ, ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 8 మంది క్యూఆర్టీ సిబ్బందితో పాటు మరిపెడ సర్కిల్‌కు చెందిన 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో గుడుంబా తయారీతో పాటు ఇతర అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.






