- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇడుపు కాయితం’ అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
‘ఇడుపు కాయితం' సినిమా టైటిల్ ట్రోలింగ్‌పై తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రం స్థాయిలో స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా.. పక్కా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ మూవీ టైటిల్‌పై నెట్టిట్లో జోరుగా వివాదం కొనసాగుతోంది. అయితే, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు తెలంగాణ యాసను కించపరిచేలా ట్రోలింగ్ చేయగా, తెలంగాణ నెటిజన్లు, మేధావులు వారికి స్ట్రాంగ్ కౌంటరే ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌ను ప్రస్తావిస్తూ తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సైలెంట్‌గా మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని సీఎం రేవంత్ రెడ్డి.. ఇక్కడి భాషను అవమానిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఇవాళ ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఆమె.. బీఆర్ఎస్‌లోని ఓ గుంటనక్క ఆంధ్రా కార్పొరేట్ శక్తులతో వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ‘ఇడుపు కాగితం’ పదానికి అర్థం పవన్ కల్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడంటూ హాట్ సెటైర్ సెటైర్ వేశారు. అనంతరం ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం జులై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం చేయనున్నట్లుగా కవిత ప్రకటించారు.






