గంగాజలంతో గ్రామ దేవతలకు అభిషేకం

by Ratna Kumari |

ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగాజలంతో అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గంగాజలంతో గ్రామ దేవతలకు అభిషేకం
X

దిశ, ముప్కాల్ : ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగాజలంతో అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం మృగశిర మాసంలో విత్తనాలు విత్తే సమయంలో ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ దేవతలకు గంగాజలంతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story