హామీలు అమలు చేయాలని కోరితే అక్రమ అరెస్టులా..?

by Ratna Kumari |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా సీపీఎం, బీజేపీ, బీఆర్ఎస్, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

హామీలు అమలు చేయాలని కోరితే అక్రమ అరెస్టులా..?
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా సీపీఎం, బీజేపీ, బీఆర్ఎస్, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం, నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందించేందుకు సిద్ధమైన నాయకులను ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకపోయిన ముందస్తు నిర్బంధాలకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించడం, హామీల అమలును కోరడం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అలాంటి స్వరాలను అణిచివేయడానికి అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం సరికాదని, అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే విడుదల చేసి, భవిష్యత్తులో ఇటువంటి నిర్బంధాలకు పాల్పడకుండా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ఉద్యమాలు కొనసాగుతాయని, అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల గొంతును మూయలేరని నాయకులు హెచ్చరించారు.

Next Story