కామారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

by Ratna Kumari |

భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

కామారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
X

దిశ, కామారెడ్డి టౌన్: భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన పూజల అనంతరం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సందేశాన్ని కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొత్త కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తుందని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story