కేటీఆర్ మానుకోట పర్యటన వాయిదా..!

by Batti.Sumithra |   (  Updated:2026-06-28 16:04:15  IST  )

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 29) జిల్లాలో చేపట్టాల్సిన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.

కేటీఆర్ మానుకోట పర్యటన వాయిదా..!
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 29) జిల్లాలో చేపట్టాల్సిన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. కేటీఆర్‌కు తీవ్ర జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మాజీ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో, కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రేపటి కార్యక్రమానికి హాజరుకావాల్సిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆమె కోరారు. పర్యటనకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story