రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Ratna Kumari |

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, హాలియా : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడకు చెందిన నల్ల సుధీర్ ( 46) శుభకార్యానికి సంబంధించిన పత్రికలను పంచేందుకు మిర్యాలగూడ నుండి హాలియా కు బైక్ పై వస్తుండగా ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో అనుముల మండలం చెక్ పోస్ట్ బంకాపురం స్టేజి సమీపంలో జరిగిన ప్రమాదంలో సుధీర్ కు తీవ్ర గాయలయ్యాయి.దీంతో అటుగా వస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు సుధీర్ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్నినల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా బైక్ ప్రమాదం పై సాంకేతిక ఆధారాలు సేకరించి పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు తానుగా బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదం జరిగిందా..? లేదా ఏదైనా వాహనం ఢీ కొట్టిందా ..అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై బండి సాయి ప్రశాంత్ తెలిపారు. మృతుని బంధువు నల్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story