- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొల్లారం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
బొల్లారం రైల్వే స్టేషన్‌లో అపస్మారక స్థితిలో లభించిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.

దిశ, సికింద్రాబాద్ : బొల్లారం రైల్వే స్టేషన్‌లో అపస్మారక స్థితిలో లభించిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం జూన్ 26న బొల్లారం రైల్వే స్టేషన్‌లో సుమారు 50 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి అనారోగ్యంతో అపస్మారక స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అతడి ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు ఉండగా, చామనఛాయ, గుండ్రని ముఖం, ఎడమవైపు కాలర్ బోన్‌పై పుట్టుమచ్చ ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతడి కుటుంబ సభ్యుల వివరాలు తెలిసి ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను 87126 58581 లేదా దర్యాప్తు అధికారిని 96662 80808 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.






