- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాన్సువాడలో మహిళ మృతి
by Ratna Kumari |
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, బాన్సువాడ: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు గుట్టమీద కాశీరాం తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి అనుషవ్వ (50) గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆమె, అనంతరం గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో మృతి చెందిన స్థితిలో కనిపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు గుట్టమీద కాశీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ తెలిపారు.
Next Story






