- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఫిల్ టవర్‌ను ఢీకొట్టిన శక్తివంతమైన పిడుగు
తన స్నేహితురాలు బ్రేకప్ చెప్పిందనే మనస్తాపంతో కర్ణాటకకు చెందిన నాగేంద్ర (30) అనే యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.

ప్రత్యేక డిజైన్‌తో సురక్షితంగా చారిత్రక కట్టడం
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌ను ఒక శక్తివంతమైన పిడుగు నిలువుగా ఢీకొట్టింది. నల్లటి మబ్బుల మధ్య 330 మీటర్ల ఎత్తున్న ఈ ఇనుప కట్టడంపై మెరుపులు పడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విజువల్స్ చూసేందుకు ఎంతో భయానకంగా ఉన్నప్పటికీ, ఐఫిల్ టవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని నిపుణులు స్పష్టం చేశారు. నిజానికి ఐఫిల్ టవర్‌పై ఏడాదికి 5 నుండి 10 సార్లు పిడుగులు పడుతుంటాయి. ఈ కట్టడాన్ని 19వ శతాబ్దపు ‘ఫెరడే కేజ్’ సూత్రం ఆధారంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. టవర్ ఎత్తుగా ఉండటం వల్ల పిడుగులు పడినా.. ఆ విద్యుత్ ప్రవాహం లోపల ఉన్న పర్యాటకులకు తాకకుండా కేవలం వెలుపలి ఇనుప ఫ్రేమ్ ద్వారా ప్రయాణిస్తుంది. టవర్ అడుగు భాగంలో ఉన్న అత్యాధునిక గ్రౌండింగ్ వ్యవస్థ ద్వారా ఆ అపారమైన విద్యుత్ క్షణాల వ్యవధిలో సురక్షితంగా భూమిలోకి వెళ్ళిపోతుంది. ప్రత్యేక రక్షణ వ్యవస్థ కారణంగానే ఈ చారిత్రక కట్టడం పిడుగుల నుండి ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది.






