- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్ల కుంభకోణంలో సంచలనం.. పేర్లు బయటపెడతానంటూ వ్యాన్ డ్రైవర్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన వడ్ల కుంభకోణం వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

దిశ, కోనరావుపేట: జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన వడ్ల కుంభకోణం వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ధాన్యం వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ.. ఈ కేసులో కీలకంగా మారిన వ్యాన్ డ్రైవర్ బుట్టం ప్రభాకర్ సంచలన విషయాలు వెల్లడించారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీనివాస కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకుల మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రభాకర్.. తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. "ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి పిలిస్తేనే నేను వ్యాన్ తీసుకెళ్లాను. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నా వాహనంలో 467 వడ్ల బస్తాలను లోడ్ చేసి నిమ్మపల్లి ఏఎంసీ గోదాముకు పంపించారు" అని తెలిపారు. అయితే అక్కడ ధాన్యం అన్‌లోడ్ కాకపోవడంతో అపారెల్ పార్కుకు తరలించాలని సూచించారని, అక్కడ అన్‌లోడ్ ప్రక్రియలో ఉండగా పరిస్థితులు మారిపోయాయని ప్రభాకర్ వివరించారు.
అసలు బాధ్యులు ఎవరో నాకు తెలుసు..
"ముందుగా ఉన్న 467 బస్తాల నుంచి 89 బస్తాలను తగ్గిస్తూ కొత్త ట్రక్ షీట్ తీసుకొచ్చారు. దీనివల్ల నా వాహనంపై కేసు వస్తుందనే భయంతో ఆ బస్తాలను గోదాం ఇన్‌ఛార్జ్‌కు అప్పగించాను" అని పేర్కొన్నారు. అదే సమయంలో మల్కాపేట సర్పంచ్ తనకు ఫోన్ చేసి 89 బస్తాలను అలాగే ఉంచాలని చెప్పినట్లు డ్రైవర్ ఆరోపించారు. అనంతరం కొన్ని బస్తాలు గోదాంలో దించారని, మిగిలిన బస్తాలను లారీలో తరలించారని తెలిపారు. తర్వాత పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని చెప్పారని, తన వ్యాన్‌పై కేసు నమోదు చేశారని సమాచారం ఇచ్చారని ప్రభాకర్ పేర్కొన్నారు. "ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరో నాకు తెలుసు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతా. తప్పు చేయని నన్ను ఇరికించి నా జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు" అంటూ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఐతే వడ్ల కుంభకోణం వ్యవహారంలో ఇరు పార్టీల మధ్యలో జరుగుతున్న ఈ వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయన్నది ...దీనికి కారణం ఐన బాధ్యుల పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.






