గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో విషాదం..

by Kodari Anjali |

గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది.

గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో విషాదం..
X

దిశ, గొల్లపల్లి: గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి ఓర్రెలో పడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గరాం మండలం యశ్వంతరావుపేట గ్రామానికి చెందిన దూడ నరసయ్య అలియాస్ బుల్లయ్య (55) వృత్తిరీత్యా బ్యాండ్ వాయిద్యకారుడు. ఈ నెల 23న వెనుగుమట్ల గ్రామానికి బ్యాండ్ వాయించేందుకు వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం యశ్వంతరావుపేట కు వెళ్తుండగా, వెనుగుమట్ల గ్రామ శివారులోని ఓర్రె వద్ద కాలుజారి అందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నరసయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య దూడ ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్ననట్లు గొల్లపల్లి ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.

Next Story