45 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక..

by Taduka Kalyani |

కాలం ఎంత గడిచినా పాఠశాల జ్ఞాపకాలు చెరగవని మరోసారి రుజువైంది. తెల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981–82 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరి ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

45 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక..
X

దిశ, రామచంద్రాపురం: కాలం ఎంత గడిచినా పాఠశాల జ్ఞాపకాలు చెరగవని మరోసారి రుజువైంది. తెల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981–82 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 45 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరి ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, రామచంద్రాపురం మండల మాజీ ఎంఈవో పి. రామ్‌రెడ్డి, పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు సి. అంజిరెడ్డి, సైన్స్ ఉపాధ్యాయుడు జై నరసింహరెడ్డి, గణిత ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి, తెల్లాపూర్ మాజీ పట్వారి బి. సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువులు విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పూర్వ విద్యార్థులకు ఆకాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తరువాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకుని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story