తెలంగాణ, ఏపీ విభజనపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు!

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-28 16:47:43  IST  )

ఏపీ, తెలంగాణ విభ‌జ‌న‌పై మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తాను విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలోనే అనేక ఉద్య‌మాలు జ‌రిగాయ‌న్నారు.

తెలంగాణ, ఏపీ విభజనపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణ విభ‌జ‌న‌పై మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తాను విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలోనే అనేక ఉద్య‌మాలు జ‌రిగాయ‌న్నారు. ముఖ్యంమంత్రి చెన్నారెడ్డిని దింపాల‌ని, ఆ త‌ర‌వాత న‌ర‌సింహ‌రావును దింపేయాల‌ని మ‌రో ఉద్య‌మం జ‌రిగింద‌న్నారు. ఏది ఏమైనా ఆనాడే రెండు రాష్ట్రల విభ‌జ‌న జ‌రిగి ఉంటే ఇంకా అభివృద్ధి చెందేవ‌ని చెప్పారు. ఏపీ మ‌రింత అభివృద్ధి చెందేద‌ని అన్నారు. బీజేపీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని పిలుపునిచ్చింద‌ని చెప్పారు.

వెంక‌య్య‌నాయుడు ఏదో ఒక‌ర‌కంగా అడ్డుక‌ట్ట వేస్తార‌ని అప్పుడు అనుకున్నార‌ని, కానీ సోనియాగాంధీ త‌న‌ను అడిగిన‌ప్పుడు విభ‌జ‌న‌కు ఓకే చెప్పాన‌ని తెలిపారు. సోనియా గాంధీ వ‌చ్చి మీరు సీరియ‌స్ గానే చెబుతున్నారా? అని అడ‌గ్గా అవున‌నే స‌మాధానం ఇచ్చాన‌ని అన్నారు. ఆ త‌ర‌వాత దిగ్విజ‌య్ సింగ్, మురళీదేవ‌ర‌ త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చి బీజేపీ తెలంగాణ‌కు అనుకూల‌మేనా? మీరు ఏదో ఒక ర‌కంగా అడ్డుక‌ట్ట వేస్తార‌ని అంతా అనుకుంటున్నారని చెప్పార‌న్నారు. తాను పార్టీ సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి పనిచేసే వ్య‌క్తినని రెండు రాష్ట్రాలు ఏర్ప‌డాల‌నేదానికి తాను వ్య‌తిరేకం కాద‌ని చెప్పిన‌ట్టు తెలిపారు. కానీ ఆంధ్ర ప్ర‌దేశ్‌కు త‌గిన న్యాయం జ‌ర‌గాల‌ని దాని కోసం పోరాడ‌తాన‌ని చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు.

ఆరోజు రాత్రి 2గంట‌ల వ‌ర‌కు వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయ‌న్నారు. తాను ఏపీకి త‌గిన న్యాయంకోసం ప్ర‌భుత్వంతో గట్టిగా వాదించాన‌ని అన్నారు. దిగ్విజ‌య్ సింగ్, ముర‌ళీదేవ‌ర త‌న‌తో సుమారు మూడునాలుగు రోజులు సంప్ర‌దింపులు జ‌రిపారిన చెప్పారు. ఒక‌వేళ మీరు విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తే మీ మీద సాకుతో మేం కూడా విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించాల‌ని అనుకుంటున్నాం అని త‌న‌తో చెప్పార‌న్నారు. కానీ తాను తెలంగాణ ఏర్పాటుకు స‌మ‌ర్దిస్తాన‌నే చెప్పానని తెలిపారు. ఆ త‌ర‌వాత ఏపీకి ఏ రాష్ట్రానికి ల‌భించ‌ని నిధులు, ప్రాజెక్టులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఏదో ఒక సంస్థ వ‌చ్చేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చాన‌ని తెలిపారు.

Next Story