- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా మాజీ ప్రధాని పీవీ జయంతి.. నివాళులర్పించిన మంత్రులు, స్పీకర్, కాంగ్రెస్ నేతలు
ఆర్థిక సంస్కరణల పితామహుడు, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థిక సంస్కరణల పితామహుడు, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రముఖులు ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.
అసెంబ్లీలో స్పీకర్, మండలి చైర్మన్ అంజలి
శాసనసభ భవనంలోని లాబీ హాల్‌లో ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు చిత్రపటానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతితో పాటు పలువురు అసెంబ్లీ, శాసన మండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పీవీ ఘాట్ వద్ద టీపీసీసీ చీఫ్, మంత్రుల నివాళి
హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద జరిగిన జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీవీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు తదితర నేతలు పీవీకి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లోనూ కాంగ్రెస్ నేతలు పీవీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.






