- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలి.. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్.
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ పలుకుబడులు, పైరవీలకు తావివ్వకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది.

దిశ, జగిత్యాల టౌన్: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ పలుకుబడులు, పైరవీలకు తావివ్వకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలో తిరుకోల శ్యాంసుందర్ అధ్యక్షతన కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో జగిత్యాల పట్టణ పరిసర మండలాల నుండి కొందరు ఉపాధ్యాయులను నిబంధనలకు విరుద్ధంగా, పైరవీలతో పట్టణంలోకి సర్దుబాటు చేశారని ఆరోపించారు. ఈ ఏడాది అటువంటి అక్రమాలకు తావివ్వకుండా, ఈ నెల 30 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా, జీవో ఎంఎస్ నెంబర్ 25 ప్రకారం మాత్రమే సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని డిఈఓ కెలవత్ రాముకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జీవో 25 ప్రకారం, మిగులు (సర్ ప్లస్) ఉపాధ్యాయులను మొదట కాంప్లెక్స్ పరిధిలో, ఆపై మండలంలో, ఆ తర్వాత పక్క మండలాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పక్షపాతం, అవినీతి చోటుచేసుకున్నా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొక్కుల రామచంద్రం, దాశెట్టి రవీందర్ రెడ్డి, అంబటి భూమేశ్వర్, ఎడ్ల గోవర్ధన్, గట్ల సంతోష్ కుమార్, ఎన్నం రామ్ రెడ్డి, బోగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.






