రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర వ్యక్తులు, చెడు నడక కలిగిన వారికి కడప జిల్లా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు....

రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, కడప టౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర వ్యక్తులు, చెడు నడక కలిగిన వారికి కడప జిల్లా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని, నేరప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి గౌరవప్రదమైన జీవనం గడపాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి అవగాహన, నియంత్రణ చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story