- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన పార్టీలో కంటెంట్ రైటర్‌లకు అవకాశం.. దరఖాస్తుల ఆహ్వానం: అర్హతలు ఇవే!
సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై పట్టు ఉండి, రచనల పట్ల ఆసక్తి ఉన్నవారికి జనసేన పార్టీ ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై పట్టు ఉండి, రచనల పట్ల ఆసక్తి ఉన్నవారికి జనసేన పార్టీ ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. తమ పార్టీ మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో కంటెంట్ రైటర్లుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న యువత, నైపుణ్యం ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం (మంగళగిరి) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
అర్హతలు, నైపుణ్యాలు..
ప్రస్తుత సామాజిక, రాజకీయ, పాలనా పరమైన అంశాలపై అభ్యర్థులకు మంచి అవగాహన ఉండాలి. తెలుగు లేదా ఆంగ్ల భాషల్లో అనర్గళంగా, స్పష్టంగా రాయగలిగే నైపుణ్యం ఉండాలి. కంటెంట్ రూపకల్పన పట్ల ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమకు ఆసక్తి, పూర్తి సాధికారత ఉన్న అంశాలను ఎంచుకుని వాటిపై కంటెంట్ అందించవచ్చని పార్టీ వెల్లడించింది.
దరఖాస్తు విధానం ఇలా..
కంటెంట్ రైటర్లుగా సేవలందించాలని భావించే వారు తమ దరఖాస్తులను జులై 5వ తేదీ (05-07-2026) లోపు [email protected] అనే ఈ-మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ బయోడేటాతో పాటుగా.. ఏదైనా సమకాలీన సామాజిక, రాజకీయ లేదా పాలనాపరమైన అంశంపై 200 పదాలకు మించకుండా ఒక వ్యాసాన్ని (Essay) తప్పనిసరిగా రాసి మెయిల్‌కు జతచేసి పంపాలని జనసేన కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, రాజకీయ పరిణామాలపై విశ్లేషణాత్మక దృక్పథం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ కోరింది.






