రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అన్న.. తమ్ముడు మృతి

by Kodari Anjali |   (  Updated:2026-06-28 14:40:27  IST  )

ఆగి ఉన్న లారీకి వెనుక నుండి బైక్‌పై ఢీకొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అయిన మండల కేంద్రంలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అన్న.. తమ్ముడు మృతి
X

దిశ, మిడ్జిల్: ఆగి ఉన్న లారీకి వెనుక నుండి బైక్ పై ఢీకొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బైక్‌పై తమ స్వగృహంకు వెళ్తుండగా.. కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక భాగంలో ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 లో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, వడ్ల రాజేందర్ మార్గమధ్యలో మృతి చెందారు. మరొకరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్ మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Next Story