తిరుమలలో భారీ నాగుపాము కలకలం.. పరుగులు తీసిన భక్తులు

by Ajay Maddhiboyina |

తిరుమల తిరుపతిలో నాగుపాము కలకలం రేపింది. గాలిగోపురం వద్దకు 7 అడుగుల నాగుపాము రావడంతో భక్తులు ఒక్కసారిగా అక్కడ నుండి పరుగులు తీశారు. టీటీడీ సెక్యురిటీ సిబ్బంది ఫారెస్ట్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో భాస్కర్ నాయుడు అనే ఉద్యోగి అక్కడకు చేరుకుని పామును బంధించారు.

తిరుమలలో భారీ నాగుపాము కలకలం.. పరుగులు తీసిన భక్తులు
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతిలో నాగుపాము కలకలం రేపింది. గాలిగోపురం వద్దకు 7 అడుగుల నాగుపాము రావడంతో భక్తులు ఒక్కసారిగా అక్కడ నుండి పరుగులు తీశారు. టీటీడీ సెక్యురిటీ సిబ్బంది ఫారెస్ట్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో భాస్కర్ నాయుడు అనే ఉద్యోగి అక్కడకు చేరుకుని పామును బంధించారు. దానిని సురక్షితంగా శేషాచలం కొండల్లో వదిలిపెట్టారు. ఇక ఏడు అడుగుల నాగుపామును చూసిన తరవాత భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే సాధారణ రోజుల్లోనే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈరోజు వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. అయితే పాము వచ్చిన సమయంలో ఆ ప్రదేశంలో భక్తులు తక్కువగా ఉండటం, పామును గమనించడం వల్ల ప్రమాదం తప్పింది. ఇక గతంలోనూ తిరుమలలో పాములు ఇలానే దర్శనం ఇచ్చాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కీటకాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story