- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ట్ వార్మింగ్ డ్రామాగా ‘హ్యాపీ జర్నీ’.. ఆకట్టుకుంటోన్న టీజర్
అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’.

దిశ, సినిమా: అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దిన ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. సాధారణంగా వచ్చే కమర్షియల్, పురుష ప్రధాన సినిమాలకు భిన్నంగా.. పూర్తిగా మహిళల ఎమోషనల్ బాండింగ్ అండ్ రోడ్-ట్రిప్ చుట్టూ తిరిగే ఈ హార్ట్-వార్మింగ్ డ్రామాలో.. తమ జీవితాల్లోని బాధలు, ఒత్తిడిని మర్చిపోవడానికి ప్యారిస్ ప్రయాణమైన ఏడుగురు మహిళల జీవితాలు అక్కడ ఎలాంటి మలుపు తిరిగాయనేది చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గాటీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






