Flipkart: భారత్‌లో బ్యూటీ బూమ్

by S Gopi |

ఒకప్పుడు విలాసంగా భావించిన బ్యూటీ ఉత్పత్తులు ఇప్పుడు రోజువారీ పర్సనల్ కేర్‌లో భాగంగా మారుతున్నాయని నివేదిక పేర్కొంది.Fli

Flipkart: భారత్‌లో బ్యూటీ బూమ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 27 బిలియన్ డాలర్ల(రూ. 2.55 లక్షల కోట్ల) విలువైన ఈ మార్కెట్ 2030 నాటికి 39 బిలియన్ డాలర్ల(రూ. 3.68 లక్షల కోట్ల)కు చేరుతుందని ఫ్లిప్‌కార్ట్ 'గ్లామ్‌అప్ యాన్యువల్ బ్యూటీ ట్రెండ్స్ రిపోర్ట్ 2026' అంచనా వేసింది. ఒకప్పుడు విలాసంగా భావించిన బ్యూటీ ఉత్పత్తులు ఇప్పుడు రోజువారీ పర్సనల్ కేర్‌లో భాగంగా మారుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ మార్పుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్యూటీ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ప్రతి సెకనుకు 12 బ్యూటీ ఉత్పత్తులు అమ్ముడవుతుండగా, 2025-26 తొలి త్రైమాసికంలో ఈ విభాగం స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) గతేడాదితో పోలిస్తే 1.5 రెట్లు, ఆర్డర్లు 1.6 రెట్లు పెరిగాయి. ఈ వృద్ధిలో జెన్-జీ వినియోగదారుల పాత్ర కీలకం. ప్రస్తుతం బ్యూటీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వారిలో సగానికి పైగా ఈ తరం వారే.

ఇక బ్యూటీ మార్కెట్ వృద్ధి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. నివేదిక ప్రకారం, ప్రతి మూడు బ్యూటీ సెర్చ్‌లలో రెండు మెట్రోయేతర నగరాల నుంచే వస్తుండగా, మొత్తం అమ్మకాలలో దాదాపు మూడో వంతు టైర్-2, చిన్న పట్టణాల నుంచే నమోదవుతోంది. దీంతో 'పిన్ కోడ్ బ్యూటీ' అనే కొత్త ట్రెండ్ వేగంగా పెరుగుతోందని నివేదిక అభిప్రాయపడింది. అంటే స్థానిక వాతావరణం, నీటి నాణ్యత, కాలుష్య స్థాయిలను బట్టి వినియోగదారుల అవసరాలు మారుతున్నాయి. ఉదాహరణకు బెంగళూరులో హార్డ్ వాటర్ వల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడే ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండగా, రాజస్థాన్‌లో పొడి వాతావరణం కారణంగా చర్మానికి తేమ అందించే స్కిన్‌కేర్ ఉత్పత్తుల కోసం కస్టమర్లు ఎక్కువగా వెతుకుతున్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

Next Story