- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌లోని గుంటనక్కే ఆ శక్తులను పెంచుతోంది.. టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ ఉద్యమాన్ని ఒకప్పుడు అడ్డుకున్న శక్తులకు ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న గుంటనక్కే పాలుపోసి పెంచుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమాన్ని ఒకప్పుడు అడ్డుకున్న శక్తులకు ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న గుంటనక్కే పాలుపోసి పెంచుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ అస్తిత్వం పై దాడులు జరుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ స్పందించకపోవడం వెనుక అదే కారణమని ఆరోపించారు. ఆదివారం ఉప్పల్ పిస్తా హౌస్ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వారే ఇప్పుడు మళ్లీ తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు ప్రోత్సాహం అందిస్తున్నది బీఆర్ఎస్‌లోని గుంటనక్కే అని ఆరోపించిన కవిత.. అందుకే తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు వచ్చినా ఆ పార్టీ మౌనంగా ఉంటోందన్నారు. బీఆర్ఎస్‌కు తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అస్తిత్వంపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ కూడా తెలంగాణ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ డెయిరీల నుంచి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలకు పాల సరఫరా జరిగేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఆ సంస్థల్లో ధోబీలు, హెయిర్ కటింగ్, ఫర్నిచర్ సరఫరా, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
ఇడుపు కాగితం అర్థం ఏంటో ఆయనకు తెలుసు
ఇడుపు కాగితం సినిమా టైటిల్ వివాదంపై స్పందించిన కవిత.. ఆ పదానికి అర్థం ఏమిటో పవన్ కళ్యాణ్ బాగా చెప్పగలరని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాష, యాసను అవమానించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు.
జూలై 2న భూపోరాటం
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలం కోసం జూలై 2న ఉప్పల్ భగాయల్‌లో పెద్ద ఎత్తున భూపోరాటం చేపడతామని కవిత ప్రకటించారు. ఉద్యమకారులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.






