రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..

by Kodari Anjali |

గద్వాల జిల్లాలోని మానవపాడు మండల పరిధిలో పోతులపాడు-అలంపూర్ మధ్య రైలు పట్టాలపై పడుకుని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, అలంపూర్: గద్వాల జిల్లాలోని మానవపాడు మండల పరిధిలో పోతులపాడు-అలంపూర్ మధ్య రైలు పట్టాలపై పడుకుని ఓ గుర్తుతెలియని వ్యక్తి (30-35 ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఎరుపు రంగు టి-షర్ట్, బ్లూ లోయర్, లేత గ్రీన్ కలర్ ఇన్నర్ ధరించి ఉన్నాడు. ఛాతి కింద కుడివైపు నల్లటి పుట్టుమచ్చ ఉంది. అతని వద్ద లభించిన బైక్ కీ ద్వారా ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచబడింది. ఇతని గురించి ఎలాంటి వివరాలు తెలిసినా వెంటనే 8341252529 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నారు.

Next Story