విండోస్ 10 యూజర్లకు గుడ్ న్యూస్.. సపోర్ట్ గడువు పెంచిన మైక్రోసాఫ్ట్

by Kema Shiva Kumar |

విండోస్ 10 వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేసింది.

విండోస్ 10 యూజర్లకు గుడ్ న్యూస్.. సపోర్ట్ గడువు పెంచిన మైక్రోసాఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా విండోస్ 10 (Windows 10) వాడుతున్న యూజర్లకు మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీ ఊరట కలిగించే విషయం చెప్పింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ (ESU) ప్రోగ్రామ్‌ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించింది. తాజా నిర్ణయంతో విండోస్ 10 యూజర్లు 2027 అక్టోబర్ వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోవచ్చు. అయితే, హార్డ్‌వేర్ సమస్యల వల్ల విండోస్ 11 (Windows 11)కి అప్‌గ్రేడ్ కాలేకపోతున్న పీసీ వినియోగదారులకు తాజా ప్రకటన ఎంతో హెల్ప్ కానుంది.

కానీ, విండోస్ 10లోనే కొనసాగాలనుకునే వారు డబ్బులు చెల్లించి ఈ ESU సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ ఎక్సెటెండెడ్ ప్రోగ్రామ్ కింద సిస్టమ్ భద్రతకు సంబంధించిన సెక్యూరిటీ అప్‌డేట్స్ మాత్రమే లభిస్తాయని తెలుస్తోంది. ఎలాంటి కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు మైక్రోసాఫ్ట్ అందించదు. పాత కంప్యూటర్లను సురక్షితంగా ఉంచుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Next Story