ప్రధాని మోడీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం

by Muthe.Rajitha |

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది.

ప్రధాని మోడీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'గార్డియన్‌ ఆఫ్‌ ది బ్లూ హారిజన్‌' (Guardian of the Blue Horizon) అవార్డు ఆయనకు లభించింది. సీషెల్స్ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్‌ హెర్మినీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోడీకి స్వయంగా అందజేశారు. అంతర్జాతీయంగా భారత్ సాధిస్తున్న ప్రగతికి, ప్రధాని నాయకత్వ పటిమకు దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇనిషియేటివ్స్, సుస్థిర అభివృద్ధిని (Sustainable Development) సాధించడంలో ప్రధాని మోడీ చొరవకు గానూ సీషెల్స్ ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. భూగోళాన్ని కాపాడుకోవడంలో గ్లోబల్ లీడర్‌గా ప్రపంచ దేశాలకు ఆయన అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని, పర్యావరణ అనుకూల విధానాలను ఈ సందర్భంగా సీషెల్స్ కొనియాడింది.

భారత ప్రజలకు పురస్కారం అంకితం

తనకు లభించిన ఈ అరుదైన గౌరవంపై ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సీషెల్స్ దేశానికి, అక్కడి ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిత్య జీవితంలో పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి రక్షణకు తమ వంతు కృషి చేస్తూ ప్రకృతితో మమేకమై జీవిస్తున్న భారతదేశ ప్రజలందరికీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story