జర్నలిస్టుల పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే : టీయూడబ్ల్యూజే (ఐజేయూ)

by Batti.Sumithra |   (  Updated:2026-06-28 13:56:54  IST  )

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పై దాడులు చేయడం ప్రజాస్వామ్యం పై దాడితో సమానమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి అన్నారు.

జర్నలిస్టుల పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే : టీయూడబ్ల్యూజే (ఐజేయూ)
X

దిశ, మేడిపల్లి : విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పై దాడులు చేయడం ప్రజాస్వామ్యం పై దాడితో సమానమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి అన్నారు. బోడుప్పల్ అంబేద్కర్ నగర్‌లో వార్తా కవరేజీ నిర్వహిస్తున్న జర్నలిస్టు విష్ణుపై జరిగిన మూకదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో సీఐ జలంధర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఘర్షణను చిత్రీకరిస్తున్న జర్నలిస్టు పై దాడి చేయడం, అతని ఇంటి పై రాళ్లు రువ్వడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, వాహనాలను ధ్వంసం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారందరినీ వెంటనే అరెస్టు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, జర్నలిస్టుల భద్రతకు పూర్తి హామీ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ముఖ్యసలహాదారులు కల్కూరి ఎల్లయ్య, వి.సూర్యనారాయణ రెడ్డి, అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.సుందర్, కోశాధికారి మరాటి మల్లేష్, ఉపాధ్యక్షుడు చింత రమేష్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Next Story