అక్కినేని వారసుడు కోసం ఘట్టమనేని వారసుడు త్యాగం.. వెనక్కి తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

by Chukka Sudharani |

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయిన విషయం తెలిసిందే.

అక్కినేని వారసుడు కోసం ఘట్టమనేని వారసుడు త్యాగం.. వెనక్కి తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
X

దిశ, సినిమా: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయిన విషయం తెలిసిందే. ‘మంగళవారం, ఆర్‌ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ సమర్పణలో చందమామకథలు పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాషా తడానీ టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జులై 9న రాబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. తాజాగా వాయిదా పడినట్లు తెలుస్తుంది. అక్కినేని అఖిల్ ‘లెలిన్’ సినిమా జులై 10న రిలీజ్ కాబోతుండగా.. అక్కినేని వారసుడి కోసం ఘట్టమనేని వారసుడు త్యాగం చేసినట్లు టాక్. ‘లెనిన్’కు పోటీగా ‘శ్రీనివాస మంగాపురం’ తీసుకురావడం ఎందుకని ఆలోచించిన మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేసే ప్లాన్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story