మోడల్ స్కూల్‌లో పార్ట్-టైమ్ ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

by Taduka Kalyani |

గొట్లపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో గంటల ప్రాతిపదికన బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గాయత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

మోడల్ స్కూల్‌లో పార్ట్-టైమ్ ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో గంటల ప్రాతిపదికన (పార్ట్‌టైమ్) బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గాయత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు తెలుగు మరియు ఫిజిక్స్ సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు అవసరమని పేర్కొన్నారు.

అర్హతలు:

తెలుగు: ఎం.ఏ (తెలుగు)తో పాటు బి.ఎడ్ లేదా టి.పి.టి పూర్తి చేసి ఉండాలి.

ఫిజిక్స్: ఎం.ఎస్సీ (ఫిజిక్స్)తో పాటు బి.ఎడ్ అర్హత కలిగి ఉండాలి.

టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు విద్యార్హతల జిరాక్స్ ప్రతులను జూన్ 29 సాయంత్రం 4 గంటలలోపు గొట్లపల్లి మోడల్ స్కూల్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం 8106427639 నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ గాయత్రి సూచించారు.

Next Story