కన్నీటి నుంచి చిరునవ్వుకు.. తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి

by Ratna Kumari |

క్షణాల్లో కనిపించకుండా పోయిన కుమారుడి కోసం తల్లిదండ్రులు ఆందోళనతో వెతికిన వేళ.. సోషల్ మీడియా ఆశాకిరణంగా మారి చివరకు చిన్నారిని సురక్షితంగా వారి ఒడికి చేర్చిన హృదయాన్ని కదిలించే ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

కన్నీటి నుంచి చిరునవ్వుకు.. తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి
X

దిశ, ఖమ్మం రూరల్ : క్షణాల్లో కనిపించకుండా పోయిన కుమారుడి కోసం తల్లిదండ్రులు ఆందోళనతో వెతికిన వేళ.. సోషల్ మీడియా ఆశాకిరణంగా మారి చివరకు చిన్నారిని సురక్షితంగా వారి ఒడికి చేర్చిన హృదయాన్ని కదిలించే ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పంపింగ్ వెల్ రోడ్డు 30వ డివిజన్‌కు చెందిన చిన్నారి అయాన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇదే సమయంలో టీఎన్‌జీవోస్ కాలనీ సమీపంలో చిన్నారిని గుర్తించిన ఖమ్మం రూరల్ పోలీసులు అతడిని భద్రంగా తమ వద్ద ఉంచారు. అనంతరం చిన్నారి వివరాలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేస్తూ, బాలుడి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లాలని సమాచారం అందించారు మరోవైపు తమ బిడ్డ కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు కూడా చిన్నారి ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పోస్టులు వేగంగా వ్యాప్తి చెందడంతో కొద్ది నిమిషాల్లోనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరింది చివరకు ఆందోళనతో గడిచిన క్షణాలకు ముగింపు పలుకుతూ చిన్నారి అయాన్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కుమారుడిని మళ్లీ చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటనలో ఖమ్మం రూరల్ పోలీసుల చొరవతో పాటు సోషల్ మీడియా స్పందన చిన్నారి కుటుంబానికి మళ్లీ ఆనందాన్ని తీసుకొచ్చింది.

Next Story