- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?: హరీష్‌రావు
రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సిద్దిపేటలో జరిగిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సిద్దిపేటలో జరిగిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మళ్లీ గెలుస్తామని నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, బీఆర్ఎస్ హయాంలో 90 లక్షల వడ్లు కొన్నామని చెప్పారు. రైతుబంధు ఎగ్గొట్టినందుకు, రైతు బీమా ఆపేసినందుకు రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే సీఎం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. మూసీని ప్రక్షాళన చేస్తానని చెబుతున్న రేవంత్ రెడ్డి ఆ నదిలో ప్రవహించే నీళ్లు మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు నుండే వస్తున్నాయని గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. నిద్రలోనూ రేవంత్ కేసీఆర్ పేరే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్ల SLBC టన్నెల్ తవ్వితే రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాలలో 12 మీటర్లు కూడా తవ్వలేదని అన్నారు.
SLBC టన్నెల్ కుప్పకూలి 8 మంది అమాయకపు కార్మికులు చనిపోతే వాళ్ల శవాలు కూడా బైటకి తియ్యని దద్దమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు పొడుగు ఉన్నాడు, జగదీష్ రెడ్డి పొట్టిగా ఉన్నాడని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మేం పొడుగు ఉంటే ఏంది పొట్టిగా ఉంటే ఏంది అని ప్రశ్నించారు. మా పనులు పొడుగ్గా ఉన్నాయి.. కానీ నీ మనసు ఆలోచనలు, నీ బుద్ధి, నువ్వు పొట్టిగానే ఉన్నావని ఎద్దేవా చేశారు. ఏం చేశావో చెప్పకుండా మమ్మల్ని తిడితే ఏం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.






