- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి!
గంగాధర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

దిశ, గంగాధర: గంగాధర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోయిన్‌పల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వెంకంపల్లి స్టేజీ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడిని వెంకంపల్లి గ్రామానికి చెందిన గుండవేణి కొమరయ్యగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న గంగాధర పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






