TRAI: కొత్త యూజర్లలో జియోను అధిగమించిన ఎయిర్‌టెల్

by S Gopi |

రిలయన్స్ జియో 21.6 లక్షల చేరికలతో దగ్గరగా ఉన్నప్పటికీ రెండో స్థానంలో కొనసాగింది. వోడాఫోన్ ఐడియా తక్కువ 1.21 లక్షల వినియోగదారులను చేర్చుకుని స్వల్పంగా రికవరీ సాధించింది.

TRAI: కొత్త యూజర్లలో జియోను అధిగమించిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం రంగంలో నెలవారీ సబ్‌స్క్రైబర్ పోటీ మరింత వేగంగా మారుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెలలో భారతీ ఎయిర్‌టెల్ 29.3 లక్షల కొత్త వైర్‌లెస్ వినియోగదారులతో ముందంజలో నిలిచింది. రిలయన్స్ జియో 21.6 లక్షల చేరికలతో దగ్గరగా ఉన్నప్పటికీ రెండో స్థానంలో కొనసాగింది. వోడాఫోన్ ఐడియా తక్కువ 1.21 లక్షల వినియోగదారులను చేర్చుకుని స్వల్పంగా రికవరీ సాధించింది. అయితే ఇది ప్రధానంగా తక్కువ ఆదాయం ఇచ్చే ఎంటర్‌ప్రైజ్, ఎం2ఎం కనెక్షన్ల వల్లే సాధ్యమైంది. మొత్తం వైర్‌లెస్ మార్కెట్ 133.7 కోట్ల నుంచి 134.3 కోట్లకు పెరిగి, నెలలో 55.6 లక్షల నికర కొత్త వినియోగదారులు చేరారు. అయితే, ప్రధానంగా నెట్‌వర్క్ నాణ్యత, భవిష్యత్ గ్రోత్ సెగ్మెంట్లలో కూడా ఉంది. మొత్తం మార్కెట్‌లో జియో 39.27 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 37.89 శాతంతో దగ్గరగా ఉంది. వోడాఫోన్ ఐడియా 15.56 శాతానికి పడిపోయింది. మరోవైపు, యాక్టివ్ యూజర్ల పరంగా ఎయిర్‌టెల్ 99 శాతానికి పైగా లీడ్ కొనసాగిస్తుండగా, జియో కూడా మెరుగ్గా ఉంది.

Next Story