వేడుకలు మొదలుపెట్టండి అంటూ విశాల్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం తన కెరీర్‌లో 35వ సినిమాగా రాబోతున్న ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

వేడుకలు మొదలుపెట్టండి అంటూ విశాల్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం తన కెరీర్‌లో 35వ సినిమాగా రాబోతున్న ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చెయ్యగా.. ఇప్పటికే వచ్చిన మొదటి సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు మేకర్స్. ఈ మేరకు విశాల్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ‘చాలా కాలం తర్వాత నా ప్రియమైన అభిమానులను/స్నేహితులను కలిశాను. హద్దులు లేకుండా ఇంత ప్రేమను చూపిస్తున్న మీ అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మకుటం సినిమా రెండవ సింగిల్ భారీ జానపద గీతం ‘నచాకే వచ్చెరా’ వచ్చేసింది. నా అభిమాన బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో, నా ప్రియమైన జి.వి. ప్రకాష్ పాడిన ఈ సూపర్ పెప్పీ జానపద గీతం వచ్చేసింది. సంగీతం మిమ్మల్ని ఆవరించనివ్వండి.. వేడుకలు మొదలవ్వనివ్వండి’ అంటూ లింక్ షేర్ చేశాడు. మాస్ బీట్‌తో ఉన్న ఈ సాంగ్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటోంది.

Next Story