- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీర్ల పండుగకు వెళ్లి వస్తూ హత్యకు గురైన వ్యక్తి
జమ్మికుంట మండలం అంకుశాపూర్‌కు చెందిన పైతరి మొగిలి (తండ్రి సాయిలు) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం అంకుశాపూర్‌కు చెందిన పైతరి మొగిలి (తండ్రి సాయిలు) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మడిపల్లి గ్రామంలో పీర్ల పండుగ చూసి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో దాడి చేసి హతమార్చినట్లు మృతుడి భార్య పైతరి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, మొగిలి సైకిల్‌పై మడిపల్లి గ్రామంలో జరుగుతున్న పీర్ల పండుగకు వెళ్లాడు. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య ఇంటికి తిరిగి బయలుదేరాడు. మడిపల్లి గ్రామ శివారుకు చేరుకునేసరికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి బలమైన ఆయుధంతో తల, నుదురు, గడ్డం కింద భాగంలో తీవ్రంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమై మొగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శారద ఇచ్చిన ఫిర్యాదులో "నా భర్త మృతిపై మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్, తండ్రి ఐలయ్యపై అనుమానం ఉంది" అని పేర్కొన్నారు. దీంతో పోలీసులు మహేష్‌ను ప్రధాన అనుమానితుడిగా పరిగణిస్తున్నారు. పీర్ల పండుగ వేళ జరిగిన ఈ హత్యతో అంకుశాపూర్, మడిపల్లి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






