- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షం తీవ్ర అంతరాయం.. భారత్, శ్రీలంక ‘ఏ’ మధ్య తొలి టెస్టు డ్రా
శ్రీలంక ‘ఏ’తో జరిగిన తొలి టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరికి డ్రాతో సరిపెట్టింది.

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక ‘ఏ’తో జరిగిన తొలి టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరికి డ్రాతో సరిపెట్టింది. ఆఖరి రోజైన ఆదివారం వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో భారత్ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా చివరి రోజు కేవలం 55 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 452/6 డిక్లేర్ ఇవ్వగా.. శ్రీలంక 330 స్కోరు వద్ద ఆలౌటైన విషయం తెలిసిందే. 122 పరుగుల ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. ఓవర్‌నైట్ స్కోరు 40/0తో ఆట కొనసాగించగా.. దేవదత్ పడిక్కల్(67) హాఫ్ సెంచరీతో రాణించాడు. రుతురాజ్ గైక్వాడ్(1), ధ్రువ్ జురెల్(14), షేక్ రషీద్(20) నిరాశపరిచారు. చివరికి 189/8 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చిన భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం(122) కలుపుకుని ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యం పెట్టింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దాదాపు రెండు గంటలపాటు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత గేము తిరిగి ప్రారంభమవ్వగా స్టంప్స్ సమయానికి కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక ‘ఏ’ 70/2తో నిలిచింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది.






