- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకుని భార్యభర్తలు ఆత్మహత్య..
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యభర్తలు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

దిశ, శంకర్ పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యభర్తలు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామానికి చెందిన వడ్ల బాల సాయి చారి (32), పద్మ (25) ఒకరికి ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం క్రితం వీరు పెళ్లి చేసుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటేల్ గూడా గ్రామంలో అద్దె ఇంట్లో ఉండి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామమైన జన వాడ గ్రామానికి వచ్చి పాత ఇంట్లో ఉంటున్నారు. ఆర్థిక కారణాలతో ఇద్దరు భార్య భర్తలు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తమ్ముడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవడం తో ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు భార్య భర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే మోకిలా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన సంఘటన గురించి ఆరా తీసి శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోకిలా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అనాధగా మారిన ఐదు నెలల చిన్నారి...
తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉరి వేసుకోవడం తో ఐదు నెలల చిన్నారి బాలుడు అనాధ గా మారాడు. పాపం అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని స్థితిలో ఆ బాలుడు అటు ఇటు చూడడం అందరిని కలిసి వేసింది.






