ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి

by Batti.Sumithra |

ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంగోతు నరేష్ (30) అనే యువకుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు.

ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి
X

దిశ, పర్వతగిరి : ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంగోతు నరేష్ (30) అనే యువకుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన ఆంగోతు వాస్రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 14న ఉదయం అన్నారం షరీఫ్ దర్గాకు కందూరు (మొక్కుబడి) పూజల కోసం వెళ్లారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్నారు.

ఈ క్రమంలో ప్రయాణిస్తున్న ఆటో నుంచి వాస్రామ్ కుమారుడు నరేష్ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో నరేష్ తల వెనుక భాగంతో పాటు ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే పేరికేడు లోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు, ఆ తర్వాత వర్ధన్నపేటలోని లక్ష్మీ గణపతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని అమృత న్యూరో సర్జన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం నరేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి వాస్రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ భోగం ప్రవీణ్ తెలిపారు.

Next Story