- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతికాలనీకి అభివృద్ధి, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పని చేస్తున్నాం : ఎమ్మెల్యే నాయిని
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్ని డివిజన్లలో ఏకకాలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్ని డివిజన్లలో ఏకకాలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం 57వ డివిజన్ పరిధిలోని గోకుల్‌నగర్, అశోక్ కాలనీ, వికాస్‌నగర్ ప్రాంతాల్లో రూ.97.92 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వరంగల్ నగరం వరదలతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొనేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ముందస్తు ప్రణాళికతో వరద ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, శాశ్వత పరిష్కారాల దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నగర ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా అవసరమైన మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయడం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
గోకుల్‌నగర్ జంక్షన్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రహదారి విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని చెప్పారు. గోకుల్‌నగర్, అశోక్ కాలనీ, వికాస్‌నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడారు. కాలనీల్లో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలు అందించిన వినతిపత్రాలను స్వీకరించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






