నిబంధనలు బేఖాతరు.. పెళ్లిళ్లకు పాఠశాల బస్సులు

by Kodari Anjali |

నాగర్‌కర్నూల్ జిల్లాలో బడి పిల్లలను సురక్షితంగా ఇళ్లకు, పాఠశాలలకు చేర్చాల్సిన స్కూల్ బస్సులు రూటు మారుస్తున్నాయి.

నిబంధనలు బేఖాతరు.. పెళ్లిళ్లకు పాఠశాల బస్సులు
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో బడి పిల్లలను సురక్షితంగా ఇళ్లకు, పాఠశాలలకు చేర్చాల్సిన స్కూల్ బస్సులు రూటు మారుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు తరలిపోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పెద్దకొత్తపల్లి లిటిల్ బడ్జ్ స్కూల్‌కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఎలాంటి నేబర్ ప్లేట్ లేకుండా వివాహ యాత్రకు వెళ్తుంది. ఆదివారం ఓ వివాహ వేడుకకు వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సును నాగర్ కర్నూల్ లైట్ మోటార్ విహికిల్ అసోసియేషన్ సభ్యుడు ఆపి డ్రైవర్ను ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు వివాహ యాత్రలకు వెళితే.. మాలాంటి హెవీ వెహికిల్స్ కొన్న వారి పరిస్థితి ఏంటని డ్రైవర్ను ప్రశ్నించారు. డ్రైవర్ పొంతన లేని సమాధానం ఇచ్చారని తెలిపారు.రవాణా శాఖ (RTO) చట్టాల ప్రకారం ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనప్పటికీ, కొందరు పాఠశాల యాజమాన్యాలు సంపాదనే ధ్యేయంగా నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం...

ఆర్టీవో నిబంధనల ప్రకారం, విద్యాసంస్థల వాహనాలకు ప్రభుత్వం ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇస్తుంది. ఈ బస్సులను కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయుల రవాణాకు మాత్రమే ఉపయోగించాలి అని చట్టం చెబుతోంది. ప్రైవేట్ స్కూల్ బస్సులను కమర్షియల్ (వాణిజ్య) అవసరాలకు, పెళ్లిళ్లకు అద్దెకు ఇవ్వడం మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం.

ప్రమాదాలకు పొంచివున్న ముప్పు..

శుభకార్యాలకు వెళ్లే క్రమంలో రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ఈ బస్సులను నడుపుతున్నారు. పాఠశాల వేళల్లో మాత్రమే డ్రైవింగ్ చేసే అలవాటు ఉన్న డ్రైవర్లు, రాత్రి వేళల్లో నిద్రమత్తు కారణంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. పైగా, ఈ బస్సులకు ఉండే బీమా కేవలం పాఠశాల అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే ప్రయాణికులకు బీమా క్లెయిమ్ కావడం కూడా అసాధ్యం.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..

మా పిల్లల భద్రత కోసం మేము వేల రూపాయలు ఫీజులు కడుతున్నాం. కానీ శని, ఆదివారాల్లో ఈ బస్సులను పెళ్లిళ్లకు తిప్పి, సోమవారం ఉదయానికి మళ్లీ మా పిల్లలను ఎక్కించుకుంటున్నారు. వరుస ప్రయాణాల వల్ల బస్సులు కండిషన్ తప్పుతున్నాయి. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి."

ప్రైవేట్ స్కూల్ బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: విద్యార్థి తండ్రి

నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రైవేట్ బస్సులు నిబంధనలు ఉల్లంఘించి వివిధ శుభకార్యాలు,పెళ్లిళ్లకు బస్సులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ డీటీఓ అహ్మద్ ఇమ్రాన్ హెచ్చరించారు.

Next Story