అయోధ్య విరాళాల వివాదం.. తెరపైకి మరికొన్ని విషయాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-28 16:26:44  IST  )

అయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిధుల గోల్ మాల్ విషయం బహిర్గతం అయ్యేకంటే కొద్దిరోజుల ముందే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నిధుల దుర్వినియోగం గురించి తెలుసని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయోధ్య విరాళాల వివాదం.. తెరపైకి మరికొన్ని విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిధుల గోల్ మాల్ విషయం బహిర్గతం అయ్యేకంటే కొద్దిరోజుల ముందే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నిధుల దుర్వినియోగం గురించి తెలుసని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జూన్ 5న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా నివాసానికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో నగదు లభించిందని, ఈ విషయం అప్పటికే పోలీసుల దృష్టికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

జూన్ 5న సోదాలు జరిగినప్పటికీ జూన్ 7న విరాళాల గోల్ మాల్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ వివాదంపై యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గురువారం అధికారులు అయోధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలు దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజల నుండి సైతం రావడంతో ఘటనపై విచారణ వేగవంతంగా పారదర్శకంగా జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story