ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న కారు.. తండ్రీ కొడుకులు మృతి

by Taduka Kalyani |

కారు కల్వర్టును ఢీకొన్న సంఘటనలో తండ్రీ కొడుకులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణ శివారు బురుగు పల్లి వద్ద చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న కారు.. తండ్రీ కొడుకులు మృతి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కారు కల్వర్టును ఢీకొన్న సంఘటనలో తండ్రీ కొడుకులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణ శివారు బురుగు పల్లి వద్ద చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ సీఐ నవత తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన అక్కగారి సాయి (26) ఆదివారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి ఫంక్షన్ నిమిత్తం వెళ్లాడు. రాత్రి సమయంలో కొడుకు హర్షవర్ధన్ (5) తో కలిసి సిద్దిపేట కు వెళ్లొస్తానని చెప్పి బంధువుల కారులో బయలు దేరాడు. ఈ క్రమంలో ఇరుకోడు గ్రామం దాటిన తర్వాత బురుగు పల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు వేగంగా కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ నవత తెలిపారు.

Next Story