కొత్తపెల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ..

by Kodari Anjali |

తాళం వేసిన ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామంలో జరిగింది.

కొత్తపెల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ..
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామంలోని ఓ తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. కొత్తపెల్లి గ్రామానికి చెందిన ఇనుకొండ మధుసూదన్ రెడ్డి కొడుకులిద్దరు హైదరాబాద్‌లో ఉండగా.. వారం క్రితం వారిని చూసేందుకు హైదరాబాద్ వెళ్లి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగిలిపోయి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా, వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పాటు బీర్వా కూడా తెరిచి ఉంది. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగతననానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. కాగా దొంగలు ఎంత మేర నగదు, బంగారం ఎత్తుకెళ్లారనే విషయం తెలియాల్సి ఉంది.

Next Story