ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఆలస్యానికి కారణమిదే!

by Ramesh Naini |

ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది.

ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఆలస్యానికి కారణమిదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ (AP EAPCET 2026) ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 30న (మంగళవారం) ఉదయం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూకే వీసీ, ఎప్‌సెట్‌ ఛైర్మన్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. అయితే, కచ్చితమైన సమయాన్ని ఇంకా ప్రకటించలేదు.

ఆలస్యానికి కారణమిదే..!

మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వాస్తవానికి ఈ ఫలితాలు జూన్ 1నే విడుదల కావాల్సి ఉంది. అయితే, ఎప్‌సెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంది. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాల కోసం అధికారులు వేచి చూడటంతో ఈ జాప్యం జరిగినట్లు అధికారుల సమాచారం. ఫలితాలు, ర్యాంకులు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్ నుంచి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది.

Next Story