- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో భారీ వరదలు.. బాపట్ల యువకుడు గల్లంతు
అమెరికాలో సంభవించిన భారీ వరదల్లో ఓ తెలుగు యువకుడు గల్లంతయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో సంభవించిన భారీ వరదల్లో ఓ తెలుగు యువకుడు గల్లంతయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేశ్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా (Omaha) నగరంలో నివసిస్తున్నాడు. అయితే, ఇటీవల అక్కడ కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా కాన్సాస్ రాష్ట్రం వెల్లింగ్టన్ సమీపంలోని ఎస్.ఆలివర్ రోడ్ ప్రాంతంలో వెంకటేశ్ ప్రమాదవశాత్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఆ యువకుడి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో స్వగ్రామంలోని అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే లేఖలు
ఈ విషయాన్ని గల్లంతైన యువకుడి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తక్షణమే స్పందించారు. వెంకటేశ్ కోసం అమెరికాలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా చూడాలని కోరుతూ ఆయన కేంద్ర, రాష్ట్ర మంత్రులకు విడివిడిగా అత్యవసర లేఖలు రాశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఈ లేఖలను పంపారు.






