జూలై 2న హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం

by Kodari Anjali |

జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించనున్న ‘భూ పోరాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు.

జూలై 2న హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం
X

దిశ, జగిత్యాల టౌన్: తెలంగాణ ఉద్యమకారుల భూ హక్కులు, పెండింగ్ సమస్యల సాధన కోసం జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించనున్న ‘భూ పోరాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జగిత్యాలలో కార్యక్రమ పోస్టర్‌ను తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకుడు నీలగిరి రాజేందర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్పర్సన్ భోగే పద్మ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణ మరియు వారి సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ భారీ భూ పోరాట కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఇంతియాజ్, శ్రీధర్, పోతు కనకయ్య, దుస్స రవీందర్, సయ్యద్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story