జిల్లా చెస్ పోటీల్లో మెరిసిన భట్టు జై

by Ratna Kumari |

ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ ఓపెన్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఎంపికల పోటీల్లో అండర్-10 విభాగంలో ప్రతిభ కనబరిచిన భట్టు జై జిల్లా స్థాయిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

జిల్లా చెస్ పోటీల్లో మెరిసిన భట్టు జై
X

దిశ, పాల్వంచ టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని అంబేద్కర్ ఐటీఐలో నిర్వహించిన కర్నల్ సంతోష్ బాబు మెమోరియల్ ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ ఓపెన్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఎంపికల పోటీల్లో అండర్-10 విభాగంలో ప్రతిభ కనబరిచిన భట్టు జై జిల్లా స్థాయిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పోటీల్లో క్లిష్టమైన ఎత్తుగడలను సమర్థవంతంగా అమలు చేస్తూ తన ఆటతీరుతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు. చిన్న వయస్సులోనే చెస్‌పై ఆసక్తి, క్రమశిక్షణతో సాధన చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న భట్టు జై ఈ విజయాన్ని కోచ్ అన్వర్ అలీ శిక్షణ, మార్గదర్శకత్వంలో సాధించడం విశేషం. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోచ్, తల్లిదండ్రులు, చెస్ క్రీడాకారులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు భట్టు జైను అభినందించి, అతని విజయ ప్రస్థానం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని శుభాకాంక్షలు తెలిపారు.

Next Story